భారత్‌ 445 ఆలౌట్‌

0
63
source twitter

దీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్‌
ముగిసిన రెండో రోజు ఆట
రాజ్‌కోట్‌: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.

ఓవర్‌ నైట్‌ స్కోర్ 326/5తో రెండోరోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 119 పరుగులు మాత్రమే చేసింది. సెంచరీ హీరో రవీంద్ర జడేజా (112) కేవలం మరో 2 పరుగులు మాత్రమే చేసి జో రూట్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌ (37), ధ్రువ్‌ జురేల్‌ (46), మహ్మద్‌ సిరాజ్‌ (3, నాటౌట్‌), బూమ్రా (26) పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత్‌ 445 పరుగులు చేసింది. ఇంగ్లీష్‌ బౌలర్లలో మార్క్‌ 4 వికెట్లు తీయగా, రెహాన్‌ అహ్మద్‌ 2, జేమ్స్‌ అండర్సన్‌, హార్ట్లీ, జో రూట్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (15) వికెట్‌ అశ్విన్‌ పడగొట్టగా, ఓల్లీ పోప్‌ (39)ను సిరాజ్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు.

మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (133 , నాటౌట్) సెంచరీ సాధించగా, జో రూట్‌ 9 పరుగులతో క్రీజులో నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఇంగ్లాండ్‌ ఇంకా 238 పరుగుల దూరంలో ఉంది.

500 వికెట్ల క్లబ్‌లో అశ్విన్‌
రెండో రోజు మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే వికెట్‌ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

టీమిండియా నుంచి ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. అశ్విన్‌ కంటే ముందు అనిల్‌ కుంబ్లే (619) ముందువరుసలో నిలిచాడు. ఓవరాల్‌గా 500 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్‌ 9వ స్థానంలో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here