నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు

0
4

– పేటీఎం ఇన్‌సైడర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకం
– 13నుంచి ఆఫ్‌లైన్‌లో మూడుచోట్ల కౌంటర్లు
ఈ నెల 19న ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను నేటి నుంచి 70శాతం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పేటీఎం ఇన్‌సైడర్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రూ.600 టికెట్ కనీస ధర కాగా, గరిష్టంగా రూ.6వేలు అమ్మనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మిగిలిన టికెట్లను 30 శాతం టికెట్లను ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ నెల 13, 14వ తేదీ నుంచి అమ్మనున్నారు. ఇందుకోసం వైజాగ్‌ నగరంలో మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం 27 వేలు. కాగా, ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఎన్ని టిక్కెట్లు అందుబాటులో ఉంచారన్నది నిర్వాహకులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here