ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటై, 91 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. శుభ్‌మన్ గిల్ (128)తో పాటు విరాట్ కోహ్లీ (186) సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వీరితో పాటు అక్షర్ పటేల్ (79), శ్రీకర్ భరత్ (44), పుజారా (42) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్ మూడేసి వికెట్లు తీయగా, మిచెస్ స్టార్క్, మాథ్యూ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది.