ఆకట్టుకుంటున్న ‘కేటీఆర్‌ బర్త్‌డే బస్‌’

0
3

– వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన అలిశెట్టి అరవింద్‌
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆ పార్టీ నేత, అభిమాని అలిశెట్టి అరవింద్ వినూత్నరీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ సారథ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

టీ హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా శుభాకాంక్షలు తెలిపిన నేతగా అలిశెట్టి చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం నేటి ఉదయం 6 గంటల నుంచి పది రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంది.‌ మాటల్లో కాదు అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిని చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here