- 6వ భారత బ్యాటర్‌గా రికార్డ్
టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ 17వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 34, 357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రన్ మిషన్ విరాట్ కోహ్లీ (25, 047), రాహుల్ ద్రవిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోనీ (17,092) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు.