రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు 

0
71

– నిండు కుండలా ప్రాజెక్టులు

– పొంగిన చెరువులు, కాల్వలు, వాగులు

– తెగిన చిన్న బోనాల చెరువు, సిరిసిల్లకు భారీ వరద

-పలు కాలనీ లు జలమయం

-సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు, బిఆర్ఎస్ నాయకులు

– మిడ్ మానేరు 22 గేట్లు ఎత్తివేత

-మూలవాగులో పెరిగిన నీటి ప్రవాహం

-కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

సిరిసిల్ల, వేములవాడ లో పునరావాస కేంద్రాల ఏర్పాటు – 120 మంది తరలింపు

– రక్షణ చర్యల్లో అధికార యంత్రాంగం

-వేములవాడలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు రాజన్న జిల్లాలో వాగులు వరదలతో పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల వరదల వల్ల జిల్లాలోని ఎగువ మానేరు పూర్తిగా నిండి పోయి మత్తడి దుంకుతుంది. మధ్యమానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరడంతో గురువారం సాయంత్రం 22 గేట్లు ఎత్తి ఎల్ఎండికి నీటిని విడుదల చేశారు.
సిరిసిల్ల చిన్నబోనాల చెరువు పూర్తిగా నిండి తెగిపోవడంతో వెంకంపేట, అశోక్ నగర్, ఆటోనగర్, అంబికా నగర్, శాంతి నగర్ తో పాటు పలు కాలనీలన్నీ జలమయ్యాయి. కాలనీలకు వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. వేములవాడలో మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, తహసీల్దార్ రాజిరెడ్డి, పోలీస్ అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.

– రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై నీటి ప్రవాహాలు చేరడంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ కు గురువారం 35 వినతులు, ఫిర్యాదులు వచ్చాయి .వాటినీ కంట్రోల్ రూమ్ బాధ్యులు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించారు. వెనువెంటనే స్పందించిన అధికారులు వాటిని పరిష్కరించారు.వీటి పరిష్కార ప్రగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. అత్యవసరం సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 9398684240 కు కాల్ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ లో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసి 120 మంది తరలించారు. రక్షణ చర్యల్లో అధికార యంత్రాంగం తలమునకలయ్యారు. వేములవాడలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ లు పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here