హర్మన్‌ అర్ధ సెంచరీ

0
6

– తొలి టీ20లో బంగ్లాపై విజయం
BAN W vs IND W 2023: ఢాకా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా మహిళా జట్టు విజయంతో బోణీ చేసింది. ఆదివారం ఢాకా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేన గెలుచుకుంది. అంతకుముందు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 114/5 పరుగులకే పరిమితం చేసింది. బంగ్లా బ్యాటర్లలో షోమ అక్తర్‌ (28, నాటౌట్‌), మోస్తరీ (23), రాణి (22) ఫర్వాలేదనిపించారు.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, మిన్ను మణి, షెఫాలీ వర్మ ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన టీమిండియా 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, జెమీమా రోడ్రిగ్స్‌ (11) నిరాశపరచగా, స్మృతీ మంధాన (38) ఫర్వాలేదనిపించింది. ఇక కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54, నాటౌట్‌) అర్ధ సెంచరీ సాధించింది. యాస్తికా భటియా (9, నాటౌట్‌) సాయంతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించింది.

బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 2, మారుఫా అక్తర్‌కు 1 వికెట్‌ దక్కింది. అర్ధ సెంచరీ సాధించిన హర్మన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు దక్కింది. ఇదిలాఉంటే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో ముందుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here