రాణించిన హర్మన్‌ప్రీత్‌, జెమీమా

0
15

– టీమిండియా 228/8
– బంగ్లాతో రెండో వన్డే
ఢాకా: బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. 17 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన భారత జట్టు ఆనంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52), జెమీమా రోడ్రిగ్స్‌ (86), స్మృతీ మంధన (36) రాణించడంతో 228 పరుగులు చేసింది.

బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖతూన్‌, నహిదా అక్తర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, మరుఫా అక్తర్‌, రబీయా ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. లాంచ్‌ తర్వాత బంగ్లా లక్ష్య ఛేదనకు దిగనుంది. ఇదిలాఉంటే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ భాగంగా తొలి వన్డేలో బంగ్లా విజయం సాధించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here