అరగంట.. అతలాకుతలం

0
3

నగరంలో భారీ వర్షం
చెరువుల్లా మారిన రోడ్లు
పలు చోట్ల ట్రాఫిక్ జాం
వాహనదారుల ఇబ్బందులు

ప్రజానావ/హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వాళ్లు అవస్థలు పడుతున్నారు.

నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, లక్డీకపూల్‌, బేగంపేట, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైనా లింగంపల్లి, పటాన్‌చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఉన్నపలంగా కురిసిన వర్షంతో ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here