జీహెచ్‌ఎంసీకి నిధుల మంజూరుపై హర్షం

0
14

ప్రజానావ, ఖైరతాబాద్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీకి ప్రభుత్వం రూ.1100 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ 8వ కౌన్సిల్ సమావేశంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పాల్గొని ప్రధానంగా మూడు అంశాలను ఆమె కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.

జీహెచ్ఎంసీ హోడింగ్ కాంట్రాక్టులో చోటుచేసుకున్న అవినీతి అవకతవకలతో జీహెచ్ఎంసీకి కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతుందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.

జీహెచ్ఎంసీలో ఏ విభాగాల్లో ఎవరు విధుల్లో ఉన్నారు ఆన్న స్పష్టత కరువైందని, దీంతో అభివృద్ధి పనులకు ఏర్పడుతున్న ఆటంకాలను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది వివరాలను వారి పనితీరుపై స్పష్టత ఇవ్వాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here