new traffic rules: ఇక మైనర్లు బండి నడిపితే అంతే..

0
212
  • రూ.25వేల జరిమానా
  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • జూన్‌ 1 నుంచే అమలు

జూన్‌ 1 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు పూర్తిగా మారనున్నాయి. రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో మైనర్లు వాహనం నడిపినా, మైనర్లకు వాహనం ఇచ్చినా ఇక ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించనుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల జరిమానాతో పాటు వారు 25ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోకుండా నిషేధం విధించనున్నారు.

అలాగే లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.500, అతివేగంతో పట్టుబడితే రూ.1000 నుంచి 2వేల వరకు జరిమానాను విధించనున్నారు. ఈ నిబంధనలు జూన్‌ 1నుంచే అమలులోకి రానున్నాయి.

ఇకనుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఓ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన పనిలేదు. లైసెన్స్‌ కావాలనుకునే వారు డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి అక్కడ లైసెన్స్‌ పొందవచ్చు.

అధీకృత ప్రైవేట్‌ డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రయివేట్‌ డ్రైవింగ్‌ స్కూళ్లకు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేసి, ఈ పరీక్షలు నిర్వహించడానికి వారికి అధికారం ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here