సెమిస్ కు గాయత్రీ పుల్లెల

0
5

లండన్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు . శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో త్రీషా జోలీాగాయత్రి పుల్లెల జంట 21-14, 18-21, 21-12తో చైనాకు చెందిన టాప్‌సీడ్‌ లీ-లూలపై పోరాడి నెగ్గారు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న 17వ ర్యాంకర్‌ త్రీషాాగాయత్రి.. రెండో గేమ్‌లో పోరాడి ఓడారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ మొదటినుంచే మెరుగైన ప్రదర్శనను కనబరిచారు.

మ్యాచ్‌ ముగించేందుకు భారతజోడీ సుమారు 64నిమిషాలసేపు పోరాడాల్సి వచ్చింది. సెమీస్‌లో భారత జోడీ కొరియాకు చెందిన లీాబెక్‌లతో తలపడనున్నారు. త్రీషాాగాయత్రి జంట వరుసగా రెండోసారి ఈ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరు ముగిసింది. గురువారం రాత్రి జరిగిన పోటీల్లో కిదాంబి శ్రీకాంత్‌ 17-21, 15-21తో నరోకా(జపాన్‌) చేతిలో, లక్ష్యసేన్‌ 13-21, 15-21తో ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌) చేతిలో ఓడారు. ఇక హెచ్‌ఎస్‌ ప్రణరు రారు 20-22, 21-15, 17-21తో గింటింగ్‌(ఇండోనేషియా) చేతిలో పోరాడి పరాజయాన్ని చవిచూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here