బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి..

0
15

– ఎన్నికల ముందు ఊపందుకున్న చేరికలు
ప్రజానావ/ఖైరతాబాద్‌: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గం లోని జూబ్లీహిల్స్ డివిజన్‌లోని పద్మాలయ అంబేద్కర్ మరియు ఐపీఎస్‌ కాలనీకి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్నారెడ్డి, శ్రీనివాసులుతో పాటు పలువురు నాయకులు డీసీసీ అధ్యక్షుడు డా. సి.రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డా. సి.రోహిన్ రెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు పెద్దపీట వేస్తామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షుడు కాటూరి రమేశ్‌, జూబ్లీహిల్స్ డివిజన్ సీనియర్ నాయకురాలు పెండ్యాల విజయలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here