ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గేలా టీఎస్ఆర్టీసీ నయా ప్లాన్: మెట్రో రైలు మోడల్ సీటింగ్!!

0
31

tsrtc బస్సులలో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని భావించి సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న బస్సులలో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండువైపులా మెట్రో రైలులో ఉన్నట్టుగా సీటింగ్ ను ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి, ఎక్కువమంది ప్రయాణించటానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.ఈ మేరకు కొన్ని బస్సులలో సీటింగ్ మార్చేసి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది. ఈ విధానం సక్సెస్ అయితే మొత్తం హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సులలో ఇదే విధానాన్ని తీసుకురానుంది. సిటీ బస్సులలో మొత్తం 44 సీట్లు ఉంటే, 63 మంది ప్రయాణం చేస్తే మొత్తం 100% ఆక్యుపెన్సీ గా ఆర్టీసీ భావిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here