food poisoning: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

0
50
  • 11మంది విద్యార్థినులకు అస్వస్థత

రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌తో మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా మరో ఫుడ్ పాయిజన్ సంఘటన చోటు చేసుకుంది.

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో శనివారం ఫుడ్ పాయిజన్‌తో 11 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు.

దీంతో అధికారులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో జరిగే వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here