సిరిసిల్లలో తొలి త్రీ స్టార్‌ హోటల్‌

0
27

– ప్రారంభించిన ఆది శ్రీనివాస్, తోట రామ్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొట్టమొదటి త్రీ స్టార్ ఎస్ ఆర్ ఆర్ గ్రాండ్ హోటల్ ని ఆదివారం నాడు వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నారై తోట రామ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధునాతన హంగులతో హోటల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. నాణ్యమైన సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు మొట్టల మహేశ్‌ కుమార్ తో పాటు వేములవాడ పట్టణ పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here