ఎట్టకేలకు ‘గుట్ట’పైకి ఆటోలు

0
37

– జెండా ఊపి ఆటోలను అనుమతించిన విప్‌ ఆలేరు

గత ప్రభుత్వ హయాంలో యాద్రాద్రి గుట్టపైకి ఆటోలను నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆటో డ్రైవర్లు, పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. అయినా అప్పటి ప్రభుత్వం కనికరించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించారు.

ఆయన వెంట యాదాద్రి భువనగరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, దేవస్థాన అధికారులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూ ఆటోలను సజావుగా కొండపైకి నడుపుకోవాలని ఆటో కార్మికులకు సూచించారు. అంతకుముందు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా ఆటో నడిపారు. మరోవైపు రెండేళ్ల తర్వాత గుట్టపైకి ఆటోలను అనుమతించడంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here