– ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం
FIFA Women’s World Cup : స్పెయిన్ మహిళా ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించి, తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ తరఫున ఏకైక గోల్ చేసిన ఓల్గా కార్మోనా జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టింది. ఇక మొదటినుంచి ఫెవరేట్ బరిలోకి దిగిన ఇంగ్థీష్ జట్టు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు 14 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా, ఇంగ్లాండ్ 7సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసింది. 29వ నిమిషంలో కార్మోనా గోల్ చేయడంతో స్పెయినా ఖాతా తెరిచింది. కొద్దిసేపు పట్టుదలగా ఆడిన ఇంగ్లాండ్ గోల్ చేసేందుకు మూడుసార్లు ప్రయత్నించగా స్పెయిన్ ఆటగాళ్లు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో స్పెయిన్ మహిళా జట్టు తొలిసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది. గెలిచిన అనంతరం స్పెయిన్ జట్టు మైదానంలో సంబురాలు చేసుకుంది. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో జపాన్ క్రీడాకారిణి హినాటా మియాజావా ఐదు గోల్స్ చేసి గోల్డన్ బూట్ అవార్డు అందుకోగా, స్పెయిన్ క్రీడాకారిణి ఐటానా బొన్మతీ గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకుంది. ఇంగ్లాండ్ గోల్ కీపర్ మేరీ ఇయర్ప్స్ గోల్డెన్ గ్లౌవ్ సొంతం చేసుకుంది. విజేత జట్టుకు రూ.35కోట్ల ఫ్రైజ్ మనీ దక్కగా, రన్నరప్‌కు రూ.25 కోట్లు దక్కింది.