తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల

0
3

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలను రాష్ర్ట ఉన్నత విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. రాష్ర్ట వాప్తంగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాల్లో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిలు 82 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, అగ్రకల్చర్‌లో 86 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో.. అబ్బాయిలు 84 శాతం, అమ్మాయిలు 87 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో టాప్‌ ర్యాంకర్లు
తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ‘అనిరుద్‌ సనపల్ల’కు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. సెకండ్‌ ర్యాంక్‌ యాకంటి పల్లి వెంకట మనిందర రెడ్డి, మూడో ర్యాంక్‌ చల్లా రమేష్, నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ సాధించారు.
అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకర్లు వీరే..
అగ్రికల్చర్‌, ఫార్మసీ కేటగిరిలో బూరుగుపల్లి సత్య ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. రెండో ర్యాంక్‌ నాసిక వెంకట తేజ, మూడో ర్యాంక్‌ పసుపులేటి లక్ష్మి, నాల్గవ ర్యాంక్‌ దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి, 5వ ర్యాంకు బోర వరుణ్‌ చక్రవర్తి ర్యాంకులు సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here