ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు కృషి

0
24

జోగులాంబ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్నొన్నారు.

సోమవారం ఆయన ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలకగా, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి ఆలయ ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా (టెంపుల్‌ టూరిజం) అభివృద్ధి చేస్తామన్నారు.

జోగులాంబ ఆలయంతో పాటు రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తామని పునరుద్ఘటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ‌, రాజేష్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మల్లు ర‌వి, మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here