తెలంగాణలో ఈడీ సోదాలు

0
3

– మెడికల్‌ కాలేజీలే టార్గెట్‌
– రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల తనిఖీలు
హైదరాబాద్‌లో ఈడీ రైడ్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా రాష్ట్రవ్యాప్తంగా 15చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో ఎస్‌వీఎస్‌, కామినేనితో పాటు పలు మెడికల్‌ కాలేజీలున్నాయి. కామినేని గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. శశిధర్‌ కామినేని, వసుంధర కామినేని, కామినేని సూర్యనారాయణ, గాయత్రిదేవి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి అధికారులు 11 బృందాలుగా బయల్దేరి వెళ్లగా, వారి వెంట సీఆర్పీఎఫ్ బలగాలు పెద్దసంఖ్యలో ఉండడం విశేషం.

హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో దాడులు జరిగాయి. ఇటీవలే రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పలువురిని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here