Eatala: రాహుల్‌ ప్రధాని అయితే హామీలు అమలు చేస్తారా?

0
103
  • రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేసినవ్‌
  • రేవంత్‌ సర్కార్‌ ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏమీ చేయలేదు
  • ఈటల రాజేందర్‌

‘గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో ఆరు డిక్లరేషన్లు, 66 హామీలు.. 420 రకాల పనులు చేసి పెడతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

వీటన్నింటినీ ముఖ్యమంత్రిగా సంతకం చేయగానే అమలు చేస్తానని చెప్పారు. అధికారం చేపట్టి ఇన్నిరోజులు అవుతున్నా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటీ అమలు చేయలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు.

సోమవారం ఆయన హుజూర్‌నగర్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత హామీలు అమలు చేస్తానన్న రేవంత్‌..

నేను ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అందుకు ఎంపీలందరినీ గెలిపించండి ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో బూటకపు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరు నెలలుగా వైద్యశాఖలో పనిచేస్తున్న వారికి జీతాలు లేవని, మందులు, టెస్టులకు డబ్బులు లేవని.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో వైద్యం, సంక్షేమం, కనీస సౌకర్యాల కల్పన మొత్తం కొరబడిందని విమర్శించారు.

రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ప్రమాణాలు చేసిన సీఎం తన మాట మీద నమ్మకం లేని స్థాయికి దిగజారారన్నారు. మేధావుల ఎన్నికల్లోనూ ప్రలోభ పెట్టడం, దబాయించడం, స్కూల్‌, కాలేజీల యాజమాన్యాలను స్టాఫ్‌తో ఓటు వేయించాలని హుకుం జారీ చేయిస్తున్నారన్నారు.

ఈ విషయంలో ప్రత్యక్షంగా మంత్రులే ఇన్వాల్వ్ కావడం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా ? హామీల అమలు కోసం కొట్లాడే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలా ఆలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here