టమాటాకు బదులు నిమ్మకాయలు తినండి

0
14

– యూపీ మంత్రి ప్రతిభా శుక్లా
హర్దోయి: టమాటాలకు బదులు నిమ్మకాలు తినొచ్చు కదా అని యూపీ మహిళా మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఓవైపు దేశవ్యాప్తంగా టమోటాల ధరలు నింగినంటుతుంటే, ప్రజలు కొనలేక, తినలేక తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఇలా స్పందించారు. అంతేకాకుండా టమాటాలు తినడం మానేస్తే వాటి ధరలు దిగివస్తాయని, లేదంటే వాటిని ఇంట్లోనే పెంచుకోవాలని సూచించారు. ఆషి అనే గ్రామంలో ఓ మహిళా న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని అందులో టమాటా మొక్కలు నాటిందని, తద్వారా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here