ఐక్య ఉద్యమం తోనే గృహ కార్మికుల సంక్షేమ చట్టం సాధ్యం

0
5
  • డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన
    ప్రజానావ/ సికింద్రాబాద్ : గృహ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్డ సాధనకు గృహ కార్మికుల ఐక్యంగా ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ గృహ కార్మికుల వారోత్సవాన్ని అంబేద్కర్ నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడుతూ డిబిఎఫ్ అధ్వర్యంలో పది రోజుల పాటు గృహ కార్మికుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గృహ కార్మికుల సంక్షేమానికి రక్షణ కు సమగ్ర చట్టం చేయాలన్నారు. గృహ కార్మికుల కు కనీస వేతనాలు అందడం లేదన్నారు. ఇఎస్ఐ,ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వృద్ద కార్మికులకు పెన్షన్ ను అమలు చేయాలన్నారు. కనీస వెతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. దొంగతనం ,లైంగిక తదితర వేధింపులకు గురవుతున్నామన్నారు. గృహ కార్మికులు ఆత్మగౌరవం తో జీవించే విధంగా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించి ఇవ్వాలన్నారు. నగరం బయట కాకుండా పని దోరికే ప్రాంతాలలోని ఇండ్లు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో, గృహా కార్మిక నాయకులు రూత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here