వామ్మో.. బీసీసీఐ అంతా పన్ను చెల్లించిందా?

0
15

క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. అందుకే ఇప్పటికీ పాకిస్తాన్‌ వంటి కొన్ని దేశాలు బీసీసీఐపై ఏడుస్తూనే ఉంటాయి. అంతేకాదు బీసీసీఐ చెప్పినట్టే ఐసీసీ చేస్తుందని లేనిపోని ఆరోపణలు చేస్తుంది. సరే ఈ విషయాన్ని పక్కనబెడితే బీసీసీఐ ఏడాదిలో ఎంత పన్ను కడుతుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే మరి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1159కోట్ల ఆదాయ పన్ను కట్టినట్లు తెలుస్తోంది. ఇదెలా బయటికొచ్చిందంటే రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్లు, 2019-20లో రూ.882.29 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే 2021-22 సీజన్‌లో బీసీసీఐ సుమారు రూ.7,660 కోట్ల ఆదాయాన్ని అర్జించగా, రూ.3,064 కోట్లు ఖర్చు చేసింది. 2020-21లో రూ.4,735 కోట్లు అర్జించగా, రూ.3,080 కోట్లు ఖర్చు చేసినట్లు వివరాలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here