ACB RIDE | డబ్బులిస్తేనే పర్మిషన్‌

0
180

ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి లంచం డిమాండ్‌
ఏసీబీకి చిక్కిన హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌


హైదరాబాద్‌, ప్రజానావ:
డబ్బులిస్తేనే ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి పర్మిషన్‌ ఇస్తానంటూ లంచం డిమాండ్‌ చేసిన హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చలిమెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్‌ రెడ్డి తన స్వగ్రామంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలనుకున్నాడు.

దీనికోసం డీటీసీఈపీ లేఅవుట్‌ పర్మిషన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా అధికారులు మాత్రం పర్మిషన్‌ ఇవ్వకుండా జాప్యం చేశారు.

దీంతో ఎందుకు పర్మిషన్‌ ఇవ్వడం లేదంటూ జితేందర్‌ రెడ్డి నిలదీయడంతో డబ్బులిస్తేనే పర్మిషన్‌ ఇస్తామంటూ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్‌ మోహన్‌ తేల్చి చెప్పారు. దీంతో చేసేదిలేక రూ.50వేలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

వెంటనే ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. జితేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం రూ.50వేలు హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్‌మోహన్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here