తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం

0
14
source: twitter

  • కృష్ణా జలాల విషయంలో శాశ్వత అన్యాయం చేశారు
  • 2016 జూన్ 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే సంతకం పెట్టారు
  • న్యాయంగా రావాల్సిన వాటా 575 టీఎంసీలు అయితే.. 299 టీఎంసీలకే అంగీకరించారు
  • మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నేత చల్లా వంశీచంద్‌ రెడ్డి లేఖ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చల్లా వంశీచంద్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు

  • కృష్ణా జలాలపై హక్కులను చేతగానితనంతో వదులుకొని తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌ది
  • తెలంగాణ వాటాగా న్యాయంగా రావాల్సింది 575 టీఎంసీలు అయితే.. కేసీఆర్ 299 టీఎంసీలకే కేంద్రం వద్ద అంగీకరించారు
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గించుకుంటూ 2016, జూన్ 21 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకం పెట్టారు. తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాశారు
  • న్యాయబద్ధమైన వాటాను వదులుకొని.. కృష్ణా పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు కట్టకుండా పెండింగ్‌ పనులు పూర్తి చేయకుండా తెలంగాణను బీడు చేసిన చరిత్ర కేసీఆర్‌దే
  • కమీషన్ల కోసం కాళేశ్వరం పేరుతో నకిలీ కట్టడాలు చూపించి కేసీఆర్ వేల కోట్లు లూటీ చేశారు
  • మేడిగడ్డ సందర్శన పేరుతో బీఆర్ఎస్ చేసే సర్కస్ ఫీట్లను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది.
  • కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే… క్రిష్ణా జలాల్లో న్యాయమైన వాటా తెలంగాణకు దక్కే అవకాశం ఉండేది
  • ఎస్ఎల్బీసీ, ఆర్డీఎస్ విస్తరణ, మహబూబ్ నగర్ లోని 10 టీఎంసీ ల ఎత్తిపోతల పథకాలు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, బీమా లిఫ్ట్ లను ఎందుకు నిర్లక్ష్యం చేశారో కేసీఆర్ తెలంగాణకు సమాధానం చెప్పాలి
  • నీటి హక్కు, వినియోగ సామర్థ్యం, ప్రజా అవసరాలను వివరిస్తేనే నదీ జలాల్లో రాష్ట్రానికి వాటాలు దక్కుతాయన్న ఇంగితం కూడా కేసీఆర్ లేదు
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వదులుకొని… ఏపీ జలదోపిడీకి కేసీఆర్ కాపలా కాశారు
  • ఆగస్టు 2020లో ఏపీ సంగమేశ్వర టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సహకరించారు. కేంద్రానికి లేఖ రాసి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారు.
  • పదేండ్ల కాలంలో కృష్ణా జలాల కోసం ఏపీ 8 ప్రాజెక్టులు, స్కీములు పెడితే… కేసీఆర్ చేసింది మాత్రం గుండుసున్నా
  • కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఒకటి కాదు రెండుసార్లు కేసీఆర్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది
  • 2022 మే 27న, మళ్లీ 2023 మే 19న కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ అంగీకారం తెలిపిన మాట వందకు వందశాతం నిజం. ఆధారాలు ఉన్నాయి.
  • రాజకీయంగా పునర్జన్మనిచ్చిన పాలమూరుకు తీరని ద్రోహం చేసిన నమ్మక ద్రోహి కేసీఆర్
  • 2009లో ఎంపీగా గెలిచేందుకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు
  • పదేండ్లు అధికారంలో ఉన్నా మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయని దగుల్బాజీతనం కేసీఆర్ ది
  • సంగం బండ రిజర్వాయర లో బండ పగలగొడితే 20 వేల ఎకరాలకు నీరు అందుతుంది అని మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు
  • సంగం బండ బాధితులకు న్యాయం చేస్తూ, ఆగమేఘాల మీద నిధుల విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు
  • సంగం బండ సమస్య తీరుస్తామని, బండ పగలగొడతామని పాదయాత్రలో హామీ ఇచ్చా… నెల రోజుల్లోనే మాట నెరవేర్చినందుకు నాకు సంతోషంగా ఉంది
  • పాలమూరుకు కేసీఆర్ పదేండ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేస్తోంది
  • కొడంగల్ – నారాయణ పేట ఎత్తిపోతల పనులు ప్రారంభించి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామనే భరోసా ఇచ్చి పాలమూరు కన్నీరు తుడుస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు చేసిన ద్రోహం పైన… పాలమూరుకు చేసిన అన్యాయంపైన కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధపడాలి
  • కేసీఆర్ దుర్మార్గాలను, నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీగా మేం సిద్ధం
  • దమ్ము, ధైర్యం ఉంటే… మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలి
  • తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షకులు ఎవరో ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారు
  • మహబూబ్ నగర్ ఓటర్లను తీర్పును రెఫరెండంగా భావిద్దాం… దమ్ముంటే సవాల్ కి సిద్ధపడు కేసీఆర్…
  • తెలంగాణకు తీరని ద్రోహం చేసి… పాలమూరును బీడు పెట్టిన నీ చరిత్ర తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here