Aadhi srinivas: కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేది ప్రజల కోసమే

0
16

సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంతోషం
గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదా కోసమే వాడుకున్నారు
త్వరలోనే మరిపెళ్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతాం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


వేములవాడ, ప్రజానావ:
ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

సోమవారం వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి, నాగయ్యపల్లి లో ప్రభుత్వ విప్ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల నియంతృత్వ పరిపాలనకు చరమ గీతం పాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటున అందించిన నియోజకవర్గ ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంతోషం కనిపిస్తుందన్నారు.

గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు.

రాష్ట్రం ఏర్పడకముందు, ఏర్పడిన పదేళ్ల తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తుచేశారు.

రైతుభరోసాపై అనవసర రాద్ధాంతం
రైతు భరోసా పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. ఇప్పటివరకు ఐదు ఎకరాలలోపు రైతు భరోసా ఇచ్చామన్నారు.

గత ప్రభుత్వం ఏప్రిల్ నాటికి రైతుబంధు ఇచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే రైతు భరోసా ఇస్తుందన్నారు.

గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి, ప్రజా సేవ కోసం కాదన్నారు.

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి మన ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అసెంబ్లీ పుస్తకంలో చేర్చారని గుర్తు చేశారు.

త్వరలోనే మరిపెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పార్టీలకతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here