ssc exams: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్షలకు ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఈ సందర్భంగా పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు.
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26,762 కేంద్రాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసింది.
గత ప్రభుత్వంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ పరీక్ష కేంద్రంలో తొలిరేజే పరీక్ష ప్రారంభమైన అరగంటకే పేపర్ కూడా లీకైన విషయం తెలిసిందే.
ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా, దాదాపు నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.