హెచ్‌ఎండీఏ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజానావ, హైదరాబాద్ బ్యూరో: మూసీ శుద్ధీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సోమవారం ఆయన నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగరంలోని చరిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.
అవసరమైతే అధికారులకు పని విభజన చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఢిల్లీకి సీఎం, మంత్రులు
ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో సోమవారం జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
పలువురు కేంద్రమంత్రులతో మంగళవారం సీఎం రేవంత్ భేటీ కానున్నట్లు సమాచారం.