చిట్యాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన అల్లకొండ కుమార్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ యూత్ అధ్యక్షుడిగా నా ఎన్నికకు సహకరించిన శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్ పానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
పార్టీ బలోపేతానికి యూత్ కాంగ్రెస్ ఎంతో ముఖ్యమని, రానున్న ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను ముందు వరుసలో ఉంచి పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తానని పేర్కొన్నారు.
నాకు ఇచ్చిన ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, ఓబిసి మండల అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, గోల్కొండ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.