‘సమతా కుంభ్‌ 2024’కు రండి

0
12

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిన ఆహ్వానించిన చినజీయర్‌ స్వామి


ప్రజానావ, హైదరాబాద్:
శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో మంగళవారం నుంచి మార్చి 3వరకు నిర్వహిస్తున్న భగవద్‌ రామానుజుల ‘సమతా కుంభ్‌-2024’ మహోత్సవానికి రావాలని

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని త్రిదండి చినజీయర్‌ స్వామి, జీయర్‌ సంస్థల ముఖ్యులు ఎర్నేని రామారావులు ఆహ్వానించారు.

సోమవారం సీఎం రేవంత్‌ను కలిసిన వీరిద్దరూ ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహం, సమతా స్ఫూర్తిని చాటుతున్న తీరుతో పాటు జగదాచార్యులైన భగవత్‌ రామానుజుల జీవిత విశేషాలను వివరించారు.

అనంతరం మంగళశాసనలు అందజేశారు. ఈ ఆహ్వానంపై స్పందించిన రేవంత్‌ తప్పకుండా రామానుజుల దివ్యమూర్తిని దర్శించుకుంటానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here