ప్రజానావ, ఖైరతాబాద్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్ నగర్ మహనీయుల విగ్రహాల వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ముద్దంగుల శ్రీనివాస్ అధ్వర్యంలో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీజేపీ కన్వీనర్ గడ్డం వెంకట్ స్వామి మాట్లాడుతూ మరాఠా సామ్రాజన్ని నెలకొల్పి మచ్చలేని వ్యక్తిత్వంలో మత సామరస్యంతో స్త్రీలను గౌరవించడం ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించిన సాహసి, సహనశీలి, వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా జిస్ నీరజ ముదిరాజ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు శంకర్, ఖైరతాబాద్ బీజేవైఎం జాయింట్ కన్వీనర్ దండుగుల శేఖర్, డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గొర్కా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, పురుషోత్తం, రాజకల, రాజారాం యాదవ్, హన్మంతు , శ్రీలక్ష్మి,
నాగమణి, మారెమ్మ, మహేశ్‌రాజ్, నరేశ్, చంద్ర రెడ్డి, రాజు, బలేశ్వర్, శివ కుమార్, అంజి, రాంబాబు, హాన్మంతు, జనార్దన్, మహేశ్, రాజేష్, కృష్ణ, రాజు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.