ప్రజానావ, చందుర్తి: చందుర్తి ఎస్ఐగా సీహెచ్.శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్‌ఐగా పనిచేసిన వెంకటేశ్వర్లు కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో ఎస్‌బీ ఎస్‌ఐగా పనిచేసిన శ్రీకాంత్ ను చందుర్తికి బదిలీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. నూతన ఎస్‌ఐకి సిబ్బంది స్వాగతం పలికారు.