సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట?

0
35

– వచ్చే నెల 3నుంచి బడ్జెట్‌ సమావేశాలు
– అదేరోజూ బడ్జెట్?
– ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
వచ్చే నెల 3 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభా సమావేశాలు ప్రారంభం కానుండగా, అదేరోజూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించగా, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈసారి బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు రూ.37వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నారు. ఓవైపు ఇదే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here