Ktr : ఇది చాలా అవమానం: కేటీఆర్‌

0
120

కాంగ్రెస్‌ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ ఐకానిక్‌ చార్మినార్‌ (Charminar)ను రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూడడం దారుణమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా, చార్మినార్‌ శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చిహ్నంగా ఉందన్నారు. యునెస్కో (unesco) వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్‌ను తలచుకోకుండా ఎవరూ ఉండలేరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

రాజముద్రలో చార్మినార్‌, కాకతీయ తోరణాలు తీసేయడం అవమానమని ఆయన ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇదిలాఉంటే తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్‌ఎస్‌ (brs party) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

చార్మినార్‌ వద్ద ఆందోళనలో కేటీఆర్‌ పాల్గొనే అవకాశముంది. రాజముద్రను ఎందుకు మార్పు చేయాల్సి వస్తుందో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here