టీమిండియా 109 ఆలౌట్‌

0
17

– ఐదు వికెట్లతో రాణించిన కుహ్నెమన్‌
భారత్‌-ఆసీస్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్‌ కుహ్నెమన్‌ ఐదు వికెట్లు తీయగా, నాథన్‌ లయాన్‌ 3, మర్ఫీ 1 వికెట్‌ తీశారు. అంతకుముందు టాస్‌ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌ మొదటి నుంచి స్పిన్నర్లకు అనుకూలించడంతో పరుగులు తీసేందుకు బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడ్డారు. 27 పరుగుల వద్ద కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (12) కుహ్నెమన్‌ బౌలింగ్‌లో స్టాంపౌట్‌ కాగా, ఆ తర్వాత కొద్దిసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ (21) క్యాచ్‌ అవుట్‌ కాగా, రెండు పరుగుల వ్యవధిలోనే టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా (1) నాథన్‌ లయాన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత వరుసగా రవీంద్ర జడేజా(4), శ్రేయాస్‌ అయ్యర్‌ (0), విరాట్‌ కోహ్లీ (22), శ్రీకర్‌ భరత్‌ (17) , రవిచంద్రన్‌ అశ్విన్‌ (3), ఉమేశ్‌యాదవ్‌ (17), సిరాజ్‌(0)లు వెనువెంటన్‌ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. అక్షర్‌ పటేల్‌ (12, నాటౌట్‌) గా నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ (22)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
నిలకడగా ఆడుతున్న ఆసీస్‌
ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను నిలకడగా మొదలుపెట్టింది. ఆదిలోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (9) వికెట్‌ను కోల్పోయినా, ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా (22), మార్నస్‌ లబుషేన్‌ (13) నెమ్మదిగా ఆడుతున్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు.
పుజారా చెత్త రికార్డు
ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తన పేరిట ఒక చెత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. ఒక బౌలర్‌ చేతిలో ఎక్కువసార్లు ఔటైన బ్యాట్స్‌మెన్‌గా ఈ జాబితాలో చేరాడు. పుజారాను నాథన్‌ లియోన్‌ ఔట్‌ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కూడా పుజారాను 12 సార్లు చేశాడు. ఇంతకుముందు అండర్‌వుడ్ చేతిలో సునీల్ గవాస్కర్ 12 సార్లు ఔట్ అవ్వగా, ఆ రికార్డను పుజారా అధిగమించినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here