బాధిత కుటుంబానికి బీఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆర్థిక సాయం

0
7

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ కు చెందిన లక్ష్మి ( 55) ఫెరాలసిస్‌తో బాధపడుతూ మృతి చెందగా, విషయం తెలుసుకున్న బీఎల్‌ఆర్‌ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి తమ ట్రస్ట్ ద్వారా సోమవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా బీఎల్‌ఆర్‌ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలను బండారి లక్ష్మారెడ్డి చేపడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కల్వల అంజి, నాగారం శేఖర్, సుంచు నర్సింగ్ రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here