బాధిత కుటుంబానికి రూ.20వేల సాయం

0
2

ప్రజానావ/ఉప్పల్‌: ఉద్యమ నాయకురాలు, మాజీ వార్డు మెంబర్ లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బీఎల్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి శుక్రవారం వాసాలమర్రిలో రూ.20వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా తాడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీఎల్‌ఆర్‌ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బండారి లక్ష్మారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కంటెస్టెంట్‌ కార్పొరేటర్, బీఎల్‌ఆర్‌ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేశ్‌ గౌడ్, షేర్ మణెమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here