బీజేపీయే కాంగ్రెస్‌కు పోటీ

0
38

– బీఆర్‌ఎస్ ఖేల్‌ఖతం
– ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

ప్రజానావ/హైదరాబాద్‌ బ్యూరో: బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిసినట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుందని చెప్పారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నా యని, బీజేపీని గెలవనివ్వకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీలు కుమ్మక్కు అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని విమర్శించారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటే. కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ. బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదు. బీఆర్‌ఎస్ అరకొర సీటు గెలిచిన, ఓడినా తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. బీఆర్‌ఎస్ కుటుంబం కోసం పనిచేసే పార్టీ. కుటుంబ అవశ్యకత పూర్తయిపోయింది.

 

హైదరాబాద్‌లోని అసదుద్దీన్ ఓవైసీ సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తాం. హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్‌ను ఓడిస్తాం. అందుకు గట్టి ప్రణాళికలు రచిస్తున్నాం. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై వస్తున్న సర్వేల్లో వాస్తవం లేదు. తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేలా కార్యాచరణ చేస్తున్నాం. ఓల్డ్ సిటీలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డూప్‌ ఫైటింగ్ చేస్తున్నాయి. వంద రోజుల్లో హామీలు అమలు, అవినీతి పరులపై చర్యలు అన్నారు. కానీ ఇంకా మీనామేషాలు లెక్క పెడుతున్నారు. ఇంకా సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. కాళేశ్వరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు.

తెలంగాణ సెంటిమెంట్‌తో ఆడుకోవద్దు. జల వివాదాలపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మభ్య పెడుతున్నాయి. నాగార్జునసాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలి. కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశంమై ఏం చేశారు’ అని ప్రశ్నంచారు. ‘బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుంది. మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వసూళ్లు మొదలు పెట్టింది. కేంద్ర కాంగ్రెస్‌కు సూటు కేసులు మోస్తున్నారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు తెలంగాణలోనూ దోచుకుంటున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. బీఆర్‌ఎస్‌లో ఉన్న నేతలు బీజీపీలో చేరాలి’ అని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here