– ఆమె వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. లిక్కర్ కేసు నిందితులు తనకు తెలుసునని గతంలో కవితే చెప్పాని గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇంతవరకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని బండి ప్రశ్నించారు.