- ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం
- అర్హులకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు
- లోక్‌సభ, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయ్యాలి
- మార్నింగ్ వాకర్స్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీగణేశ్
కంటోన్మెంట్, ప్రజానావ: బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకనే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీగణేశ్ ఆరోపించారు.
గురువారం ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్-1, 6లో పలు పార్కుల్లోకి వచ్చిన మార్నింగ్ వాకర్స్‌తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా శ్రీగణేశ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పథకాలను ఒక్కొక్కటిగా అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.
త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్‌ను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు బద్ధం బలవంత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శామ్యూల్, సదానంద్, సంజీవ్, శరత్, నాగిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.