బండి అమిత్‌ షాను అందుకే కలిశారా?

0
26

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ రాష్ర్ట శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. సోమవారంనాడు ఆయనను తన కార్యాలయంలో సంజయ్ కలిసి రాష్ర్టంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అమిత్ షా తో సంజయ్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలపై ఇరువురి నడుమ చర్చ జరిగినట్లు తెలిసింది.

పార్టీని తెలంగాణలో ఎలా అధికారంలోకి తీసుకురావాలో కూడా తనకు సంబంధించిన అనుభవాన్ని అమిత్ షాతో బండి పంచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారంలో బండి సంజయ్‌ కొంతమంది నేతలకు అదే వేదిక ద్వారా కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కిషన్‌రెడ్డినైనా సరిగ్గా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం మానుకోవాలని సభలోనే వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఇదే విషయమై బండి సంజయ్‌ ఢిల్లీకి వెళ్లి ఎందుకో అలా మాట్లాడాల్సి వచ్చిందో అమిత్‌ షా వివరించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here