బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు కాంగ్రెస్ కుట్ర
బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
ప్రజానావ, వికారాబాద్: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే చేసిందని గుర్తు చేశారు.
బీజేపీ బీఆర్‌ఎస్‌తో రహస్యంగా పొత్తు కుదుర్చుకుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని సంజయ్ పేర్కొన్నారు. తాండూరులో మంగళవారం విజయ సంకల్ప్ బస్సు యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అధిష్ఠానం కూడా ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు.