actress hema: నేను విచారణకు రాను

0
167

బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌ హేమ పేరు బయటికొచ్చిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్‌ షాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌లో పరీక్షించగా 88మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది.

ఇందులో హేమ కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం విచారణకు రావాలని హేమకు సీసీబీ (సెంట్రల్‌ క్రైమ్‌ బ్యూరో) నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులను అందుకున్న నటి హేమ విచారణకు రాలేనంటూ సీసీబీకి లేఖ రాసింది. తాను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు, ఆరోగ్యం సహకరించడం లేదని లేఖలో పేర్కొంది.

అయితే దీనిని పరిగణలోకి తీసుకొని సీసీబీ ఈ సాయంత్రం మరోసారి హేమకు నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here