ఏసీబీ వలలో అవినీతి తిమింగళం

0
50

కాంట్రాక్టర్‌ నుంచి రూ.84వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జగ జ్యోతి సోమవారం కాంట్రాక్టర్‌ వద్ద నుంచి రూ.84వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

పక్కా ప్రణాళికతో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంతో పాటు ఆమె ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

కాంట్రాక్టర్‌ వద్ద లంచం తీసుకున్న జగ జ్యోతిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఔషధాల టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేయగా, బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను

ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో లచ్చునాయక్‌ను ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వారం క్రితం కూడా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సత్యనారాయణ కూడా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here