ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి

0
24

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రజా ఆరోగ్యం పై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు.

గురువారం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆస్పత్రిలో మోకాలి శాస్త్ర చికిత్స నిర్వహించిన అభినందిస్తూ, బాధితులను వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట అన్నారు. వేములవాడ ఆసుపత్రిలో మోకాలి కీలు మార్పిడి శాస్త్ర చికిత్స నిర్వహించడం మన ఆస్పత్రికి ఎంతో గర్వకారణం అన్నారు.

ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామన్నారు.

ఈ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.. ఆస్పత్రికి వచ్చే వారిని ప్రేమగా పలకరిస్తూ వారికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు.

ఆసుపత్రిని 100 పడకల నుండి సామర్థ్యం పెంపు దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రులు ఎల్లవేళలా కృషి చేస్తాయని,

పేద ప్రజలు అప్పుచేసి ప్రయివేటు వైద్య చికిత్సకు వెళ్లకుండా ఉండేందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here