కంటతడి పెట్టిన సత్యవతి రాథోడ్

0
6

– మాచర్ల పాపయ్య మృతిపై భావోద్వేగం
– కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజానావ/మహబూబాబాద్‌: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ కంటతడి పెట్టుకున్నారు. తన వద్ద 30ఏళ్లుగా పనిచేస్తున్న మాచర్ల పాపయ్య మృతితో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, గుండ్రాతి మడుగు చేరుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ పాపయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాపయ్య తన వ్యక్తిగత సిబ్బందిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారని, ఆయన మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. పాపయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. మంత్రి వెంట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్ బిందు, కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, సర్పంచ్ హరి ప్రసాద్, బయ్యారం పీఎసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు గుగులోత్ కిషన్ నాయక్, శ్రీకాంత్, అనిల్ రెడ్డి, గుగులోత్ శ్రీరామ్ నాయక్, కిషోర్ వర్మ, పత్తి వెంకన్న, నగేశ్‌, రాజు, వేంకట చారి, సురేశ్‌, మైసయ్య, రాందాస్, డాక్టర్ సతీష్ , డాక్టర్ సుందర్ నాయక్ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here