భారత్ అభివృద్ధిపై విదేశాల్లో చర్చ

0
44

యూపీలో పరిస్థితులు మారాయి
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వేగంగా అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోడీ


లక్నో:
భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారని ప్రధాని మోడీ తెలిపారు. తాను 4-5 రోజుల క్రితం యూఏఈ, ఖతార్‌ను సందర్శించి తిరిగి వచ్చానని, భారతదేశ అభివద్ధి గురించి ప్రతి దేశం నమ్మకంగా ఉందన్నారు.

ప్రపంచం మొత్తం భారతదేశం మెరుగైన రాబడికి హామీగా ఉందని తెలిపారు. సోమవారం ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.

అనంతరం మోడీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఒకప్పుడు యూపీ అంటే ఘర్షణలు.. కర్ఫ్యూలే ఉండేవన్నారు.

ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు ఇంతకు మంచి సంతోషం ఏముంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here