– తిరుచ్చి ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ వ్యక్తి
ఇటీవలి కాలంలో చాలామంది అక్రమంగా డబ్బులు, బంగారంతో ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఓ వ్యక్తి మాత్రం కొండచిలువలు, బల్లులతో పట్టుబడడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. మలేషియాలోని కౌలాలంటపూర్‌కు చెందిన మహ్మద్ మొయిద్దీన్ అనే వ్యక్తి OD 223 అనే బాటిక్ ఎయిర్‌లైన్స్‌లో తిరుచ్చికి చేరుకున్నాడు. ఇతడిపై లగేజీపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మొయిద్దీన్ బ్యాగులో 47 రకాలకు చెందిన కొండ చిలువలతో పాటు రెండు పెద్ద బల్లులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రంధ్రాలు ఉన్న బ్యాగులో తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులను పిలిపించి వాటిని తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మహ్మద్ మొయిద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.